కేంద్ర ప్రభుత్వ పథకాలు సమర్దవంతంగా అమలు చేయండి
దిశ కమిటి అధ్యక్షురాలు ఎం.పి. గుమ్మా తనూజా రాణి
పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : గిరిజనాభివృద్దే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్దవంతంగా అమలు చేయాలని దిశ కమిటి అధ్యక్షురాలు, అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మా తనూజా రాణి అన్నారు. గిరిజన ప్రాంతంల పని చేయడం అధికారులు అదృష్టంగా భావించాలన్నారు. అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటి (దిశ) సమావేశం నిర్వహించారు. గత మూడు నెలలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయం, పశు సంవర్ధకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖలో పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. పధకాలు అమలు పై ప్రజా ఎంపిపిలు, జిల్లా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. పథకాలు అమలులో ప్రజా ప్రతినిధులు నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కాఫీ రైతులకు అందిస్తున్న ఉపకరణాలపై ఆరా తీసారు. డ్రోన్ల గురించి ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. రూ.10 లక్షల విలువైన డ్రోన్లను రూ.8 లక్షల రాయితీ పై ప్రభుత్వం అందిస్తోందని డ్రోన్లపై రైతులను చైతన్యం చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీకి దగ్గరలో కాఫీ పల్పింగ్ యూనిట్లు చేర్పాటు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాతీయ రహదారి విస్తరణలో ధ్వంసమైన చెక్ డ్యాంలు, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు ఎప్పటి లోగా పూర్తి చేస్తారని నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసు కున్నారు.
అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాను ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసి జిల్లాను అన్ని రంగాలలో అభివృధివృద్ధి చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల భవనాలు లేని 373 పాఠశాలలకు రూ.45 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ మంజూరు చేసిందన్నారు. చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.7 కోట్ల మంజూరయ్యాయని తెలియజేసారు. వ్యవసాయ ఉపకరణాలు లబ్దిదారులకు పంపిణీ చేసేటప్పుడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో చర్చించి అవసరమై ఉపకరణాలు పంపిణీ చేయాలని సూచించారు. అవసరమైన స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు. జాతీయ రహదారిపై పశులు సంచరించడవలన ప్రమాదాలు జరుగుతున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని పశువుల యజమానులకు జరిమానా విధించాలని పంచాయతీ శాఖ అధికారులకు సూచించారు. గిరిజన రైతులకు ఉపయోగా పడే వ్యవసాయ ఉప కరణాలు పంపిణీ చేయాలని సూచించారు జిల్లా అభివృ ద్దికి కేంద్ర ప్రభుత్వ 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయని అన్నారు. నిధులును సక్రమంగా ఖర్చు చేసి అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలకు బ్యాంకు లింకేజీ అందించి వ్యవసాయాభివృద్ధిక కృషి చేయాలని స్పష్టం చేసారు. మండల స్థాయి అధికారులు మండల సర్యసభ్య సమావేశాలకు హాజరు కావడంలేదని పలువురు ఎపిపిలు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని చెప్పారు. పవర్ టిల్లర్లు, పవర్ వీడర్ల వంటి వ్యవసాయ ఉపకరణాలను రైతులకు వ్యక్తిగతంగా అందించాలని సూచించారు. ఎకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, సమకూర్చాలని చెప్పారు. తాగునీటి వసతులు
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం, పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు జిల్లా పరిషత్ సి. ఇ. ఓ .పి.నారాయణ మూర్తి, డి ఆర్ డిఏపిడి వి. మురళి, డ్వమా పిడి డా. విద్యాసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ బి ఎస్ నంద్, సిపి ఓ పి. ప్రసాద్ 5, విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు, సర్వ శిక్ష ఎపిసి స్వామినాయుడు, చింతపల్లి ఎంపిపి కె. అనూషా, హుకుంపేట ఎంపిపి రాజబాబు, రంపచోడవరం, రాజవొమ్మంగి ఎపిపిలు శ్రీదేవి, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జారీ : డిపి ఆర్ ఓ, ఎ ఎస్సార్ జిల్లా, పాడేరు.
0 Comments