తెదేపా మండల ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా త్రినాధ్
పార్టీని నమ్ముకున్న వారికి తగిన గుర్తింపు
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 23 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : చింతపల్లి మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎస్టీ సెల్ కమిటీకి మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా గోపినాయక త్రినాథ్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని తెలుగుదేశం పార్టీ ఎన్నడు వీడుకోదని, అలాంటి వారికి పార్టీ గుర్తించి, సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని అన్నారు. దీనికి తానే ఉదాహరణని, సాధారణ కార్యకర్తగా, పార్టీ కోసం పనిచేసిన తనను గుర్తించిన నియోజకవర్గ పెద్దలు, పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరికి, మండల టీడీపీ నాయకులకు, పార్టీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా, చింతపల్లి మండలంలోని గిరిజనుల జీవితాలను మెరుగుపరచడం, వారి సంక్షేమం కోసం పని చేయడం తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ నియామకం ద్వారా స్థానిక గిరిజన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, తెదేపాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
0 Comments