వేగవంతంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలను గుర్తించాలి
సేవతో తృప్తి... సాయంతో సంతృప్తి
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
అల్లూరి జిల్లా, పాడేరు / రంపచోడవరం, ఆగష్టు 21 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వేగవంతంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలను గుర్తించాలని, సేవతో తృప్తి... సాయంతో సంతృప్తినిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.
గురువారం రంపచోడవరం మండలం నుండి జిల్లా కలెక్టర్ అందరూ మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లతో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటికీ నమోదైన మార్గదర్శులు, బంగారు కుటుంబాల వివరాలపై ఆరాతీశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా బంగారు కుటుంబాల వివరాలు సిద్ధం చేయాలన్నారు. మండలం స్థాయిలో మండలం ప్రత్యేక అధికారి పూర్తి భాద్యతలు వహించాలన్నారు. మండలం ప్రత్యేక అధికారి మండలం అధికారులతో సమావేశాలు నిర్వహించాలాన్నారు. మండల, సచివాలయ స్థాయిలో పురోగతి లేన్నారు. మండల ప్రత్యేక అధికారి, తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో పనుల పురోగతి కావాలన్నారు. రానున్న మూడు రోజుల్లో మార్గదర్శులు, బంగారు కుటుంబాలు గుర్తించాలన్నారు. ప్రాజెక్ట్ అధికారులు రోజు వారీగా ఎన్రోల్ అయినా మార్గదర్శులు, బంగారు కుటుంబాల పై సమీక్షించాలన్నారు. సచివాలయం ద్వారా ఎన్రోల్ వేగవంత చేయడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారి, తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు వారి మండలంలో నిడ్ ఆసిన్మెంట్ విద్య, వైద్యం తదితరాలు గుర్తించాలన్నారు. గ్రామాల వారీగా పర్యటించి అక్కడ ఉన్న వారు ఎన్రోల్ అయ్యారో లేదో ఆరాతీసి ఎన్రోల్ చేయాలన్నారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వివిధ శాఖల సేవలలో పనితీరును తెలుసుకుంటూ సేకరించిన IVRS కాల్స్ నుద్దేశించి పంచాయతీ శాఖ, రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లయ్, ఆరోగ్య శాఖ ల జిల్లా అధికారులతో విశ్లేషించి తగు ఆదేశాలు జారీ చేస్తూ, పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కి జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ్, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు కె. సింహాచలం, అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్, (వర్చువల్), పాడేరు కలెక్టరెట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా రెవిన్యూ అధికారి పద్మాలత, జిల్లా P4 ప్రత్యేక అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వి.ఎస్. లోకేశ్వర రావు, డిజిపిఓ కె. పి. చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు హాజరైయారు.
0 Comments