కొయ్యూరు, ఆగస్టు 23 (ఎడిటర్ విఎస్ జే ఆనంద్): మండలంలోని నడిపాలెం గ్రామానికి చెందిన జె. దినేశ్ మెగా డీఎస్సీ ఎస్టీ కేటగిరి పీజీటీ ఇంగ్లీష్ లో రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్, జోన్-1లో ప్రదమ ర్యాంక్ సాధించాడు. వివరాల్లోకి వెళితే, మండలంలోని నడిం పాలెం గ్రామ పంచాయతీకి చెందిన జె. దినేశ్ తండ్రి ఆనందరావు చింతపల్లి గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తల్లి జయంతి గృహిణి. దినేశ్ బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాడు. తండ్రి బాటలో పయనించాలనే బావనతో ఎంఏ ఇంగ్లీష్, బిఈడీ చేశాడు. తొలి ప్రయత్నంగా మెగా డీఎస్సీలో ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలకు పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టు లకు పరీక్ష రాశాడు. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఫలితాల్లో దినేశ్ పీజీటీ ఇంగ్లీష్ లో ఎస్టీ కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంగ్, జోన్-1లో ప్రదమ ర్యాంగ్, టీజీటీ ఇం గ్లీష్లో జోన్-1లో తృతీయ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ గణితంలో 17వ ర్యాంక్ సాధించాడు. ఈసందర్భంగా దినేశ్ విలేకర్లతో మాట్లాడుతూ తాను పీజీటీ ఇంగ్లీష్ పోస్టు ఎంపిక చేసుకుంటానని, తన తండ్రి ప్రోత్సాహంతోనే కోచింగ్ లేకుండగా మెగా డీఎస్సీలో రాణించానని తెలిపారు.
0 Comments