జాబ్ మేళలో 51 మంది ఎంపిక
పాలిటెక్ని కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు
పాడేరు, ఆగష్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ (APSSDC), జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 141 మంది అభ్యర్థులు హాజరుకాగ అందులో 51మంది ఎంపిక అయినట్లు పాలిటెక్ని కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి మెరుగుపరచుకోవాలని తెలిపారు. సోమవారం నిర్వహించిన జాబ్ మేళ కి 144 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 51 మందికి పలు కంపెనీలకు ఉద్యోగాల కు ఎంపికయ్యారన్నారు. ఈ జాబ్ మేళా లో పలు కంపెనీనీలు పాల్గొన్నాయి అన్నారు. ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు జీతం 10,000/- నుండి 20,000 వరకు ఇవ్వటం జరుగుతుందన్నారు.
ఈ జాబ్ మేళాలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, రూప, మెకానికల్ హెడ్ డా.పి.రోహణి, జిల్లా నైపుణ్యభివ్రుద్ది అధికారి, APSSDC సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments