అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలి
వినతుల పరిష్కారం వేగవంతం చేయాలి
పిజిఆర్ఎస్ కు 119 అర్జీలు
జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ
పాడేరు, ఆగష్టు 22 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వినతుల పరిష్కారానికి వేగవంతం చేయాలి, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు.
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డిఆర్ఓ కె.పద్మలత సంయుక్తంగా వివిధ మండలాల నుండి వచ్చిన తాగునీటి, రహదారులు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, అటవీ హక్కు పత్రాలు, రోడ్డు విస్తర్ణలో దుకాణాలు నష్టపోయి దుకాణాలకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపుపై ఫిర్యాదులు అర్జీదారుల నుండి 119 వినతులు స్వీకరించారు. అర్జీ దారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు అందించి త్వరితగతన పరిష్కరించాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. ఆర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ను సంప్రదించవచ్చన్నారు.
స్వీకరించిన ఫిర్యాదులు
చింతపల్లి మండలం బెన్నవరం గ్రామ పంచాయితీ నక్కమెట్ట గ్రామం చెందిన వంతల త్రినాద్, పోతురాజు గుమ్మాలు గ్రామానికి చెందిన మర్రి సాంబ శివరావు గ్రామంలో మినీ గోకులాల షేడ్స్ నిర్మించడం జరిగిందని వాటికీ సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లింపులు జరగలేదని, సంబంధిత బిల్లుల సొమ్ము ఇప్పించమని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
హుకుంపేట మండలం మర్రిపుట్టు గ్రామానికి చెందిన సిహెచ్ కాంతమ్మ తను గిరిజన కులానికి చెందిన వికలాంగుల రాలునని తనకి వికలాంగుల పెన్షన్ ఇప్పించవలసినదిగా కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
హుకుంపేట మండలం కొంతిలి గ్రామానికి చెందిన ఎ సత్యవతి తనకి కొంతిలి గ్రామంలో 80 సెంట్ల భూమి ఉన్నదని, ఆ భూమి కొందరు అన్యాయం ఆక్రమించు కున్నారని తనకు న్యాయం చేయవలసినదిగా కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
హుకుంపేట మండలం బి. బొడ్డ పుట్టు పంచాయతీ, దబ్బ గురువు గ్రామానికి చెందిన గిరిజన కులానికి చెందిన వి. రాజులమ్మ తన భర్త 2021 వ సంవత్సరం మరణించారాని పెన్షన్ కోసం అప్పటి నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తనకి నేటికీ పెన్షన్ మంజూరు కాలేదని తనకి పెన్షన్ మంజూరు కోరుతూ వినతి పత్రం సమర్పించారు
డుంబ్రి గూడ మండలం కొల్లాపుట్టు గ్రామ పంచాయితీ పరిధి లో డెక్కపారు గ్రామములో సుమారు 25 కుటుంబాలు నివాసిస్తున్నారని, గ్రామానికి రోడ్డు సౌకర్యము లేనందున చాలా ఇబ్బందులు పడుత్తున్నారని, బొడ్ల మామిడి జంక్షన్ నుండి డెక్కపారు గ్రామం వరకు సుమారు 1కీ.మీ దూరం ఉంటుందని, డెక్కపారు గ్రామం వరకు తారురోడ్డు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు
జి. మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానివాసి వంతల మచ్చమ్మ హౌసింగ్ లిస్ట్ లో తనపేరు ఉందని, సిస్టమ్ లో ప్రపోజుడ్ సైట్ అని చూపిస్తుందని హౌసింగ్ అధికారులు అంటున్నారు. లింటల్ లెవెల్ వరకు నిర్మాణం చేయడం జరిగింది, బిల్లు పెట్టడానికి అవడం లేదని విన్నవించుకుంటూ వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్డిసి, ఎంవిఎస్ లోకేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. విద్యాసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీ, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్ నందా, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డా.వి.ఏ.స్వామి నాయుడు వివిధ శాఖల అధికారులు, తాహాసిల్దార్లు తదితరులు ఉన్నారు.
0 Comments