కుల గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ :జ్యోతిరావు పూలే ఓ బి సి జాతీయ అధ్యక్షుడు పూతల ప్రసాద్ నాయుడు హర్షం

నర్సీపట్నం ఏప్రిల్ 30( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి ): భారత దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై జ్యోతిరావు పూలే ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని డిమాండ్ చేస్తూ ప్రసాద్ నాయుడు ఉద్యమం నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, కాంగ్రెస్, బిజెపి నేతలు కులగణన కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. ఢిల్లీలో ఆందోళనలు చేయడం జరిగింది. అరెస్ట్ కూడా అయ్యారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తీర్మానం చేశారు. కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జ్యోతిరావు పూలే ఓబిసి జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు కృషి ఎంతో ఉందని బిసి వర్గాల నేతలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా
ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ మా పోరాటానికి ఇన్ని రోజులకు ఫలితం దక్కిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కులగణన భారతదేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఎంతో దోహదపడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments