బిజెపిలో చేరిన డాక్టర్ కేవీవీ సత్యనారాయణ...నర్సీపట్నంలో కీలక రాజకీయ పరిణామం

నర్సీపట్నం, జనవరి 7( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్.బి.ఎల్. స్వామి): నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. నర్సీపట్నం ప్రాంతంలో చిన్నపిల్లల వైద్యనిపుణులుగా, రాజకీయ నాయకుడిగా నియోజకవర్గ ప్రజలకు చిరపరిచితులైన డాక్టర్ కిల్లాడ వెంకట సత్యనారాయణ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో ప్రజారాజ్యం పార్టీలలో చురుగ్గా పని చేశారు. కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా ఆయా పార్టీలలో ఈయనకి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు.ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా డాక్టర్ సత్యనారాయణ బిజెపిలో చేరాలని ఆ పార్టీకి చెందిన ప్రముఖుల నుంచి ఆహ్వానం అందుతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం విశాఖపట్నంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు పరమేశ్వరరావు, విశాఖపట్నం సిటీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్, స్టేట్ జనరల్ సెక్రెటరీ కాశీరాజు, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి, గవిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments