జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కు చింతపల్లి ఎంపీపీ కోరాబు అనుష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ ని కలిసిన ఎంపీపీ, జడ్పిటిసి సభ్యులు ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పిటిసి సభ్యులు మాట్లాడుతూ.. చింతపల్లి మండల అభివృద్ధికి జడ్పీ చైర్పర్సన్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. తాజాగా జిల్లా పరిషత్ నుంచి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అత్యధికంగా బోర్ వెల్స్ మంజూరు చేసిన ఘనత జడ్పీ చైర్ పర్సన్ కి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లోనూ చింతపల్లి మండలంలో పలు గ్రామాల అభివృద్ధికి జడ్పీ చైర్పర్సన్ పూర్తి సహకారం అందజేయాలని కోరడం జరిగిందని ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు జడ్పిటిసి సభ్యురాలు రోషిని ఎంపీడీవో యూఎస్ వి శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ సాయి పాల్గొన్నారు.
0 Comments