అవంతిలో రెండు రోజుల సాంకేతిక ప్రదర్శన.. ప్రారంభంసమస్యల పరీక్షించే సాంకేతిక నైపుణ్యం అవసరం

నర్సీపట్నం (సిహెచ్. బి.ఎల్. స్వామి సీనియర్ జర్నలిస్టు):  అవంతి పాలిటెక్నిక్ కళాశాల మరియు అవంతి ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా సృజన 2K24 పేరుతో రెండు రోజులపాటు నిర్వహించే సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం అవంతి కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్య అతిధులు చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఏ. నాగరాజు, రాంకో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఖిందర్ భాష , ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మోహనరావు లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్వర్గస్తులైన భారత దేశ ప్రధానమంత్రి గొప్ప ఆర్థిక వేత్త డా. మన్మోహన్ సింగ్ గారి చిత్ర పటానికి పూల మల వేసి నివాళులు అర్పించారు.
 అవంతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రసాద్ రావు అద్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన రాంకో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఖిందర్ భాష మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తన భవిష్యత్తు బాగుపడే విధంగా అడుగులు వేయాలని అందుకు గాను లక్ష్యాన్ని ఏర్పరచుకొని సరియైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగాఅభివృద్ది చెందుతూవుంది. ముఖ్యంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సు, సాంకేతిక విజ్ఞానం మెరుగు పరుచు కోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. చోడవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఏ. నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క వినూత్న సాంకేతిక ఆలోచనలు ఇటువంటి సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా బయటపడుతుందని అలాగే విద్యార్థుల్లోని దాగివున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేరేపించవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుటకు పాలిటెక్నిక్ విద్య పునాది వంటిదని అందువలన ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యను బోధించడానికి అనుమతులు జారీ చేసింది. సృజన 2K24 వంటి కార్యక్రమాలు విద్యార్థి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లోని వినూత్న సాంకేతిక ఆలోచనలను వెలికి తీస్తుందని తెలిపారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారందరూ పాలిటెక్నిక్ అభ్యసించిన వారేనని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి, సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి పునాదులువేయాలని కోరారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని మీకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మోహనరావు మాట్లాడుతూ సాంకేతిక రూపకల్పన మనిషి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ప్రస్తుత కాలంలో వినూత్న పోకడలు ముఖ్య భూమికి పోషిస్తున్నాయని సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి కోసం నిరంతరం అభ్యసన కొనసాగించాలని కోరారు.అవంతి ఇంజనీరింగ్ కళాశాల శిక్షణ మరియు ఉపాధి కల్పన అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజ్ఞానంతో పాటు నైపుణ్యం కూడా ఉన్నప్పుడే సాంకేతిక అభివృద్ధి చెందగలమని తెలిపారు. పాలిటెక్నిక్ అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకొని మీ భవిష్యత్తును అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే కళాశాలలో ఉపాధి కల్పన కోసం కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీద శిక్షణ ఇస్తున్నామని, ఇవి ఉద్యోగం సంపాదించడానికి అవసరమని తెలిపారు. అందువల్ల ప్రతి విద్యార్థి శిక్షణలో పాల్గొని తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలను కోరారు. ఈరోజు సాంకేతిక ప్రదర్శనలో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 81 సాంకేతిక నమూనాలు 50 పత్రిక ప్రదర్శనలు మరియు వివిధ పాఠశాలల నుంచి మొత్తం 21 సాంకేతిక నమూనాలు ప్రదర్శనలో ఉంచారు. ఈరోజు ప్రదర్శనకు వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి సుమారు 900 మంది విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన సాంకేతిక నమూనాలను వీక్షించారు.

Post a Comment

0 Comments