చింతపల్లి, డిసెంబరు 4 (జ్యోతి): సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆదివాసీ ట్రస్టుపై సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారం చేస్తున్న ఓ ఉపాధ్యా యుడుపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఆదివాసీ ట్రస్టు చైర్మన్ కేబీ పడాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు రాష్ట్రాల గిరిజన గ్రామాల్లో ఆదివాసీల సా మాజిక, ఆర్థిక ప్రగతి కోసం ట్రస్టు పనిచేస్తుందన్నారు. ట్రస్టు పరిధిలో 2.20లక్షల మంది సభ్యులున్నా రన్నారు. ట్రస్టు సభ్యులకు అనారోగ్యానికి గురైతే ట్రస్టు ద్వారా ప్రైవేటు ఆస్పత్రుతలో చికిత్స అందిస్తుందని, వైద్యం ఖర్చులన్నీ ట్రస్టు భరిస్తుందన్నారు. తాజాగా అంతర్ల గ్రామానికి చెందిన కవడం కృష్ణ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడితే ట్రస్టు ద్వారా వైద్య ఖర్చులకోసం రూ.50వేలు అందిం చామన్నారు. అయితే ట్రస్టు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేని ఓ ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈమేరకు ఉపాధ్యాయుడు పై సీసీఏ రూల్స్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి వండలం బాలయ్య, సభ్యుడు మోరీ రవి పాల్గొన్నారు.
0 Comments