ఉత్తమ ఉపాధ్యాయుడు చల్లంగి సన్యాసిరావు సేవలు అభినందనీయం: ప్రధానోపాధ్యాయులు తగ్గి పాపయమ్మ

సీనియర్ ఉపాధ్యాయుడు సన్యాసిరావుని సన్మానిస్తున్న విద్యార్థులు
చింతపల్లి , సెప్టెంబర్ 5:
విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో అత్యుత్తమ సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు చల్లంగి సన్యాసిరావుని అభినందిస్తున్నానని రింతాడ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగ్గి పాపయమ్మ అన్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు గురుపూజోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయుడు సన్యాసిరావుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సన్యాసరావు సేవలు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నడూ మర్చిపోలేదన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం ఉపాధ్యాయులు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

Post a Comment

0 Comments