కొయ్యురు , సెప్టెంబర్ 5:
విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో అత్యుత్తమ సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయురాలు వసుపరి లీలావతిని అభినందిస్తున్నానని కొయ్యూరు డిప్యూటీ తహసిల్దార్ దుమంతి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో గిరిజన ఉద్యోగుల సంఘం, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మండలంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న లీలావతి సేవలు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నడూ మర్చిపోలేదన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం ఉపాధ్యాయులు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని డిప్యూటీ తహసిల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాంబాబు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments