తాజంగి లో మొక్కలు నాటిన జనసైనికులు

తాజంగి ఆసుపత్రిలో మొక్కలు నాటుతున్న జనసైనికులు
చింతపల్లి సెప్టెంబర్ 2:
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని తాజంగి గ్రామపంచాయతీలో జనసైనికులు మొక్కలు నాటారు. తన జన్మదినం వేడుకలో భాగంగా జనసైనికులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు తాజంగి జన సేన నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రి, పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయన నటుడుగా, రాజకీయ నేతగా ప్రజల మన్నలను అందుకుంటున్నారన్నారు. పవన్ ఆశయ సాధనకు జనసైనికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఉగ్రంగి లక్ష్మణరావు, శెట్టి మోహన్ రావు, శెట్టి శంకరరావు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లి సీతారాం, నాయకులు వనుగు మణికంఠ, సాలేబు సన్యాసిరావు, బి. నూకరాజు,జన సైనికులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments