చింతపల్లి, సెప్టెంబర్ 20:(జయానంద్) సిద్ధి వినాయక నవరాత్రులను పురస్కరించుకొని చింతపల్లి పాత బస్టాండ్ లో నిర్వహించిన భారీ అన్న సమారాధనకు విశేష స్పందన లభించింది. పాత బస్టాండ్ దుకాణ సముదాయం నిర్వాహకులు గురువారం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి సుమారు మూడువేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పాత బస్టాండ్ భక్తులతో రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులు అన్నదాన కార్యక్రమంలో భోజనాలు చేస్తూ కనిపించారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోగేశ్వరరావు, పెద్దిరెడ్డి బేతాళుడు, నిర్వాహకులు తాటిపాకల రమేష్, బంగారయ్య శెట్టి, బండారు సత్తిబాబు, ఈశ్వర రావు, వరహాలు, తాటిపాకల దాసు, మెడికల్ షాప్ బమర్లాల్, సూరిబాబు, టీవీ రాము, తహసిల్దార్ టి.రామకృష్ణ, హెచ్ డబ్ల్యు ఓ పసుపులేటి వినాయకరావు పాల్గొన్నారు.
0 Comments