తాజంగి జలాశయంలో పెరిగిన నీటి మట్టం:తహీసల్దార్ రామకృష్ణ

జలాశయంలో జాలార్లకు లభించిన చేపలను పరిశీలిస్తున్న తహసీ ల్దార్ రామకృష్ణ 

చింతపల్లి, జూలై 22: మండలంలోని తాజంగి జలాశయంలో నీటి మట్టం పెరిగిందని స్థానిక తహసీ ల్దార్ టి. రామకృష్ణ తెలిపారు. సోమవారం తాజంగి పంచాయతీలో పర్యటించిన తహసీల్దార్ జలాశయం, కుడి, ఎడమ కాలువాలను పరిశీలించారు. ఈసందర్భం గా తహసీల్దార్ మాట్లాడుతూ మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎరువ నుంచి వర్షపు నీరు జలాశయానికి చేరుకున్నదన్నారు. జలాశయం నిండు కుండను తలపిస్తున్నదన్నారు. జలాశయం నుంచి దిగువకు నీరు వెళుతుందన్నారు. జలాశయం దిగువనున్న పంట పొలాల్లో చెప్పుకోదగిన పంట నష్టంలేదన్నారు. అయి తే జలాశయంలో గిరిజన జాలూరులకు చేపలు అధికంగా లభిస్తున్నాయన్నారు. 

Post a Comment

0 Comments