చింతపల్లి, జూలై 22: క్షేత్ర స్థాయి ఉద్యోగులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానిక ఎంపీపీ కోరాబు అనుషదేవి అన్నారు. సోమవారం ఎస్ఎంఐ ఏఈఈ లోకేశ్ తో కలిసి తాజంగి జలాశయం దిగువ పంట పొలాలు, వాగులను ఎంపీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. గిరిజన రైతులు వరి నాట్లు వేయకపోవడం వల్ల పంట నష్టం పెద్దగాలేదన్నారు. గ్రామాల్లో ఎక్కడైన ఆస్తి నస్టం జరిగితే వెంటనే వీఆర్వో, కార్యదర్శిలు మండల కేంద్రానికి తెలియజేయాలన్నారు. అలాగే వర్షాల వల్ల గిరిజన గ్రామాల్లో వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన గ్రామాల్లో వైద్యులు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. గిరిజనులు వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు.
0 Comments