వైసీపీకి ఎదురుగాలి... టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు


గూడెంకొత్త వీధి/ చింతపల్లి, మే 6. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. వారం రోజుల కిందట వైసీపీ మద్దతు లోతుగెడ్డ సర్పంచ్ చింతర్ల సునీల్, అన్నవరం సర్పంచ్ సన్యాసిరావు, వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పాంగి బాబూరావు టీడీపీలో చేరారు. రెండు రోజుల కిందట జీకేవీధి మాజీ సర్పంచ్లు(వైసీపీ మద్దతు) పసుపులేటి రామకృష్ణ, నారాయణమ్మలు టీడీపీలో చేరారు. సోమవారం అన్నవరం గ్రామ పంచాయతీలో టీడీపీ అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో జీకేవీధికి చెందిన సీనియర్ వైసీసీ మాజీ మండల కన్వినర్ గొర్లె కోటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు లక్ష్మి, కుర్తాడ జానకి టీడీపీలో చేరారు. అలాగే వైసీపీ ఎంపీపీ కోరాబు అనుషదేవి సొంత సెగ్మెంట్ తాజంగికి చెందిన 30 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరారు. లంబసింగి, గొందిపాకలు, పెదబరడ పంచాయతీల నుంచి 50 మంది వైసీపీ అభిమానులు టీడీపీలో చేరారు. కాగా మరో రెండు రోజుల్లో చింతపల్లి, జీకేవీధి మండలా కు చెందిన వైసీపీ మద్దతు సర్పంచ్లు, వైసీపీ ఎంపీటీసీలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు ఒకేసారి భారీ సంఖ్యలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడంపై చర్చనీయంశంగా మారింది. వైసీపీ నుంచి వసల నాయకులతో టీడీపీలో నూతనోత్సాహం పెరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కారణంగానే పార్టీ మారాలివస్తుందని టీడీపీలో చేరిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కృషిచేస్తామని టీడీపీలో చేరిన వైసీపీ నా యకులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments