నేను గెలిస్తే ఒక్కడినే ఎమ్మెల్యేను.. అయ్యన్నపాత్రుడిని గెలిపిస్తే నలుగురు ఎమ్మెల్యేలు.. నా ఇంట్లో నేను ఒక్కడినే రాజకీయాలు చేస్తాను... నా కుటుంబం జోక్యం ఉండదు.. వైయస్సార్ పార్టీ అభ్యర్థి పెట్ట గణేష్ ఇంటింటి ప్రచారం

నర్సీపట్నం, ఏప్రిల్ 15 ( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బి ఎల్ స్వామి) :నేను గెలిస్తే ఒక్కడినే ఎమ్మెల్యేను, అయ్యన్నపాత్రుడు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. నియోజవర్గ ప్రజలు, ఈ నలుగురు ఎమ్మెల్యేలతో వేగలేక అవస్థలు పడతారని సిట్టింగ్ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమా శంకర్ గణేష్ అన్నారు. నన్ను గెలిపిస్తే ప్రజలంతా నా వద్దకే వచ్చి నేరుగా పనులు చేయించుకోవచ్చని చెప్పారు. నా భార్య , పిల్లలు ఎవరు రాజకీయాల్లో జోక్యం చేసుకోరని కూడా అన్నారు. అదే అయ్యన్నపాత్రుడిని గెలిపిస్తే ఒక పని కోసం వెళ్లాలంటే పెద్ద కొడుకుని చిన్న కొడుకుని, భార్యని ,కలిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప మీ పనులు జరగవని చెప్పారు. ఒకరిని గెలిపించుకుంటారా, నలుగురు ఎమ్మెల్యేలు ఉండే అయ్యన్న ను గెలిపించుకుంటారా అనేది ప్రజలు నిర్ణయించాలని కోరారు.మున్సిపాలిటీ 22వ వార్డు వెంకు నాయుడుపేటలో సోమవారం ఉదయం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు ఎమ్మెల్యే గణేష్ వెంట నడిచారు. 
అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతీ ఇంటి  ముందుకు వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లి, ప్రజలను వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థించారు. తన గెలుపు సహకరించమని కోరుతూ, ఆశీర్వదించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. తన ప్రచారంలో వెంకన్న నాయుడుపేటలో ఒకచోట పూరీలు వేయించి టిఫిన్లు సరఫరా చేతి మగ్గం పై వస్త్రాలు తయారు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారి యొక్క స్థితిగతులను కూడా తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని గణేష్ కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, 22వ పాడించార్జ్ పట్ల నాయుడు అయ్యరక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కర్రి కనక మహాలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు కరీ రాంగోపాల్ ,కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి,  సిరసపల్లి నాని, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ, సచివాలయ కన్వీనర్ తమరాన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments