వైసిపి అభ్యర్థి గణేష్ కు అడుగడుగునా హారతులు.. కౌన్సిలర్ జగదీశ్వరి (చిన్ని ) ఆధ్వర్యంలో 16 వ వార్డ్ లో అపూర్వ స్వాగతం

నర్సీపట్నం, ఏప్రిల్ 30(సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) :నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు శారాదానగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కు మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు ఎమ్మెల్యే వెంట నడిచారు. మంగళవారం 16 వార్డులో వైసిపి అభ్యర్థి గణేష్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలు ఎమ్మెల్యే గణేష్ పై పూల వర్షం కురిపించారు. వార్డు లో చేసిన అభివృద్ధితో, ప్రజల అభిమానం పొందిన వీరమాచినేని జగదీశ్వరి (చిన్ని) ఆధ్వర్యంలో, గణేష్ కు వార్డు ప్రజలు నీరాజనాలు పలికారు. గత పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన శారదా నగర్ లో ఎమ్మెల్యే గణేష్ ఆశీస్సులతో, కౌన్సిలర్ జగదీశ్వరి ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారు. ఇదే విషయాన్ని వార్డ్ ప్రజలు ఎమ్మెల్యే గణేష్ కు ప్రచార సమయంలో చెప్పారు. వార్డు ప్రజల సమస్యల పట్ల నిరంతరం అందుబాటులో ఉంటారని కౌన్సిలర్ జగదీశ్వరి పనితీరు పై ప్రజలు ఎమ్మెల్యే గణేష్ ఎదుట సంతోషం వ్యక్తం చేశారు. ఏప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారని వివరించారు. ఈ సందర్భంగా వీధి రోడ్లు లేక ఎన్నో అవస్థలు పడేవారిమని గుర్తు చేసుకున్నారు. 16 వ వార్డ్ శారద నగర్ లో సిమెంట్ రోడ్లు వేసి తమకు ఎంతోమేలు చేశారని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు వాటి నాయకులు చిరంజీవి ఏఎన్ఎల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments