నర్సీపట్నం, ఏప్రిల్ 9( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) :క్రోధి నామ సంవత్సర ఉగాది నియోజకవర్గ ప్రజలకు ఆశలను నెరవేర్చాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆకాంక్షించారు. మంగళవారం తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వారితో ఆయన ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ఈ ఉగాది ప్రజలకు మేలు చేయాలని కోరుకున్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే గణేష్ ను కలిశారు. 16 వవార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, వినాయక దేవస్థానం చైర్మన్ దేవత అరుణ, ఎమ్మెల్యే గణేష్ కు మిఠాయిలు తినిపించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చోటి , నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల వాసు, సీనియర్ వైసీపీ నాయకులు పెట్ల భద్రాచలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి కోల ఈశ్వరరావు, నర్సీపట్నం మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు ఏకాశివ, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీనివాస్, కొణతాల వరలక్ష్మి, తదితరులు అభినందనలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
0 Comments