ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి: అనకాపల్లి ఎంపి అభ్యర్ధి సీఎం రమేష్

నర్సిపట్నం, ఏప్రిల్ 16( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బి ఎల్ స్వామి): ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కూటమి అధికారంలోకి రావాలని అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్ అన్నారు. మంగళవారం బలిఘట్టంలో  బీజేపీ,టీడీపీ,జనసేన ఆధ్వర్యంలో జరిగిన యువశక్తి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం  విఫలమైందన్నారు. డ్రగ్స్ , గంజాయి  లతో యువతను ప్రక్కద్రోవ పట్టిస్తున్నారన్నారు. కూటమి అభ్యర్ధులను గెలిపిస్తే  ఈ ప్రాంతంలో  అనేక పరిశ్రమలను కేంద్రంతో మాట్లాడి తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉపాధి కలిపిస్తామని హామీ ఇచ్చారు. లంబసింగి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా రూపొందిస్తామని తెలియజేసారు. ముందుగా  అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్ధి,  మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అవినీతి వైసీపీని గెద్ది దించాలని  యువతకు పిలుపునిచ్చారు..వంగవీటి మోహనరంగా  తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్ డీ యే,oరాష్ట్రంలో టీడీపీ,బీజేపీ,జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టాభిరామయ్య, చింతకాయల విజయ్, సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments