మహిళల ప్రగతి కోసం శ్రమించిన పార్టీ తెలుగుదేశం.. మేలుకో మహిళ సదస్సులో అయ్యన్న సతీమణి పద్మావతి

నర్సీపట్నం, ఏప్రిల్ 24 (సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి): మహిళా అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీయే కృషి చేసిందని టిడిపి అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి అన్నారు. మహిళలకు ఆస్తిలో పురుషులతో సమానంగా హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. డ్వాక్రా సంఘాలను విస్తృతంగా ఏర్పాటుచేసి, మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్నపాత్రుడును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 
బుధవారం సాయంత్రం మాకవర పాలెం మండలం తామరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేలుకో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన లో మహిళలపై అరాచకాలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు . ఈ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు కోడళ్ళు తో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్రా పాత్రుడు, మండల పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు నాయుడు పాల్గొన్నారు.పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Post a Comment

0 Comments