రెండోవ వార్డులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు జననీరాజనం

నర్సీపట్నం, ఏప్రిల్ 12( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బి ఎల్ స్వామి) : నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డులో శుక్రవారం సాయంత్రం  సిట్టింగ్ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టారు. పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.  పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు ఎమ్మెల్యే గణేష్ వెంట నడిచారు.  ప్రతీ ఇంటి  ముందుకు వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లి, ప్రజలను వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థించారు. తన గెలుపుకు  సహకరించమని కోరారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి మీ ఆశీర్వాదం కావాలని  కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్న పథకాల ద్వారా పేద వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. 
సంక్షేమ పథకాలు దొర లబ్ధి పొందిన పేద  ప్రజలు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, రెండో వార్డ్ కౌన్సిలర్ సిరసపల్లి నాని,  కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, మాకిరెడ్డి బుల్లిదొర,  టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ,  సచివాలయాల  కన్వీనర్ తమరాన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments