భర్తను కోల్పోయిన ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

చింతపల్లి, మార్చి 28( విఎస్ జయానంద్): భర్తను కోల్పోయిన చింతపల్లి ఎంపీటీసీ-2 సభ్యురాలు జయలక్ష్మి కుటుంబాన్ని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పరామర్శించారు. ఎంపీటీసీ సభ్యురాలు భర్త భౌతిక కాయానికి నివాళి అర్పించారు. చింతపల్లి ఎంపీటీసీ-2 చింతాడ జయలక్ష్మి భర్త సత్యనారాయణ అనారోగ్యం కారణంగా గురువారం తుది శ్వాస విడిచారు. ఈయనను కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులు శతవిధాలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సత్యనారాయణ మరణించారన్న విషయం తెలిసిన వెంటనే పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి హుటాహుటిన చింతపల్లి చేరుకొని ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ యజమాని లేని లోటు తీరనిదని, ఎంపీటీసీ సభ్యురాలు కుటుంబాన్ని దేవుడు ఓదార్చాలని ప్రార్థిస్తున్నానని, జయలక్ష్మి కి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కోరాబు అనూష దేవి, సర్పంచ్ దురియా పుష్పలత, వైస్ సర్పంచు నూర్ సాహెబ్, ఎంపీటీసీ ధారలక్ష్మి పద్మ ,జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, పార్టీ మండల అధ్యక్షులు మోరి రవి, లక్ష్మణ్, రామకృష్ణ, వైస్ ఎంపీపీలు గోపి నాయక్ శారద, వెంగళరావు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Post a Comment

0 Comments