చింతపల్లి మార్చి 28(విఎస్ జయానంద్): చింతపల్లి ఎంపీటీసీ - 2 సభ్యురాలు జయలక్ష్మి భర్త సత్యనారాయణ పార్థీవ దేహానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు నివాళి అర్పించారు. ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి భర్త సత్యనారాయణ అనారోగ్యంతో గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలకు హాజరైన విశ్వేశ్వర రాజు, ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, సత్యనారాయణ భౌతిగాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన జయలక్ష్మి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని, ఆమెకు వైసిపి కుటుంబం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రాజు వెంట చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, చింతపల్లి, జీకే వీధి మండలాధ్యక్షులు మోరి రవి, బొబ్బిలి లక్ష్మణ్, జెసిఎస్ మండల కన్వీనర్ పాంగి గణబాబు, స్థానిక సర్పంచ్ దురియా పుష్ప లత, ఎంపీటీసీ ధార లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ బూసరి క్రిష్ణ రావు, కొర్ర రాజారావు, షేక్ నాగర్, షేక్ మీరా, సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
0 Comments