జగన్నకు ఓటర్లే బలం, బలగం, వైసీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలే సైనికులు.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు

చింతపల్లి మార్చి 27( వి ఎస్ జయానంద్) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటర్లే బలము బలగమని, వైసీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలే సైనికులని పాడేరు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. బుధవారం చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో పాడేరు శాసన సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజ రాణి, పాడేరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్ రాజు, పీలా వెంకట లక్ష్మీ, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ వెంకట లక్ష్మీ సమక్షంలో పార్టీ క్యాడర్ సమావేశం జరిగింది. 
ఈ సమావేశానికి హాజరైన పాడేరు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ..ఈ ఐదేళ్లు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా సాగించారన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తూనే ఏ నాయకుడు చెయ్యలేని విధంగా సంక్షేమ పాలనా అందించినా ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన ద్వారా ప్రజలందరికీ మేలు జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్లీ ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన పార్లిమెంట్ అభ్యర్థి తనుజ రాణిని, నియోజకవర్గంలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కోరభు అనూష దేవి, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు మోరీ రవి, వైసీపీ సీనియర్ నాయకులు జల్లి సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జల్లి హలియా రాణి, ఎంపీటీసీలు సభ్యులు, సర్పంచులు, మండల డైరెక్టర్లు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, జె సి ఎస్ మండల కన్వీనర్లు, గృహ సారథులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments