ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వంది.. పథకాల పేరిట మోసం చేసే పార్టీ టిడిపి:ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్

నర్సీపట్నం, మార్చి 28(సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి):ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసిపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు.  ప్రతి గడపలోను సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా, అమలు చేస్తున్నామని ,సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. గురువారం మాకవరపాలెం మండలం మల్లవరం గ్రామంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు అడుగడుగునా హారతులు ఇస్తూ పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లలో శాసనసభ్యులను ప్రతి ఇంటి గడపకు పంపించి, ఆదర్శవంతమైన పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతి గడపలోను ఆర్థికంగా లబ్ధి పొందారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పు బెల్లాలు పంచుతున్నారని, ప్రజలను చులకనగా మాట్లాడారని అన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు, ఏ రోజు ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని అనుకోలేదని విమర్శించారు. పథకాల పేరుతో దోచుకుని, టిడిపి నాయకులు ఆర్థికoగా లబ్ది పొందారని, పేద ప్రజలను గాలికి వదిలేసారని దుయ్య బట్టారు . మళ్ళీ మోసపూరితమైన హామీలతో , చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ పథకాలు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. పథకాలు పేరిట మోసం చేసే టిడిపిని ప్రజలు నమ్మరాదని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ ,మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల వాసు, జడ్పిటిసి పెట్ల భద్రాచలం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకల బాలకృష్ణ, కన్నూరు నాయుడు, బొడ్డు గోవిందు, మల్లవరం సర్పంచ్ తాతాజీ,వైసీపీ నాయకులు పైల నాయుడు, తమరాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments