మైనా రిసార్ట్స్ పై భారంగి మీనాక్షికి ఎటువంటి హక్కు లేదు.. సర్వహక్కులు నాకే ఉన్నాయి.. స్పందనలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశాం.. ఆర్ఐ జారీ చేసినా రసీదు చెల్లుబాటు కాదన్నా అధికారులు: భూమి యజమాని కేదారి వెంకటస్వామి

మైనా రిసార్ట్స్ పై భారంగి మీనాక్షికి ఎటువంటి హక్కు లేదు
సర్వహక్కులు నాకే ఉన్నాయి
స్పందనలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశాం
ఆర్ఐ జారీ చేసినా రసీదు చెల్లుబాటు కాదన్నా అధికారులు
భూమి యజమాని కేదారి వెంకటస్వామి
చింతపల్లి, ఫిబ్రవరి 2:
చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ లబ్బంగి కొత్త వీధిలోనున్న మైనా రిసార్ట్స్ పై బారంగి మీనాక్షి అనే వ్యక్తికి ఎటువంటి హక్కు లేదని, సర్వహక్కులు తనకే ఉన్నాయని భూమి యజమాని కేదారి వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం పాడేరు స్పందనలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన భూమి యజమాని కేదారి వెంకటస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. లబ్బంగి కొత్త వీధి లో తనకు పిత్రార్జితంగా సంక్రమించిన వ్యవసాయ భూమి సర్వే నెంబరు8-5 పి లో0.46 ఎకరాలు, 10-3 పి లోని0. 46 ఎకరాలు భూమిని పదవి విరమణ పొందిన ఎంపీడీవో ప్రేమకరరావుకి 2019లో ఐదు సంవత్సరాల కాలపరిమితి పై లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు. తాను లీజుకి ఇచ్చిన భూమి కొనుగోలు చేసినట్టుగా ప్రేమాకర్ రావు అనుచరురాలు భారంగి మీనాక్షి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి భూమి, రిసార్ట్స్ లను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసిందన్నారు. దీనిపై స్పందనలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డిఎల్ పిఓ లకు ఫిర్యాదు చేశామన్నారు. ఎటువంటి విచారణ లేకుండా, రెండో పార్టీ అయినా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మైనా రిసార్ట్స్ ని, తన భూమిని భారంగి మీనాక్షికి అప్పగిస్తూ రెవిన్యూ ఇన్స్పెక్టర్ జారీచేసిన రసీదు చెల్లుబాటు కాదని అధికారులు తెలియజేశారు అన్నారు. మై భూమి ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగలేనందున బారంగి మీనాక్షికి ఎటువంటి హక్కులు లేవని అధికారులు స్పష్టం చేశారు అన్నారు. మైనా రిసార్ట్స్ పై సర్వహక్కులు తనకి ఉన్నాయని, తన భూమి, రిసార్ట్స్ జోలికి ఎవరు వచ్చినా చట్టరీత్యా బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. 

Post a Comment

0 Comments