చింతపల్లి, నవంబరు 25: మండలంలోని తాజంగి దొంతుల మ్మ కొండపై స్థానిక భక్తులు శివ పార్వతి విగ్రహాలను ఏర్పాటు చే స్తున్నారు. దొంతులమ్మ కొండకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అమ్మవా రిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుం టారు. దీంతో శివపార్వతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు నిధులు సమీకరించుకుని నెల రోజుల క్రితం విగ్రహాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం భీమిలి సద్గురు సేవాశ్రమం స్వామీజి, ప్రముఖ అధ్యాత్మిక ప్రవచన కర్త కొండవీటి జ్యోతిర్మయి చేతులు మీదుగా ప్రారంభించేందుకు శివపార్వతి విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేస్తున్నారు.
0 Comments