చింతపల్లి, అక్టోబర్ 9:మండలంలోని యర్రబొమ్మలు గ్రామపంచాయతీ కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో పలు గ్రామాల నుండి తరలివచ్చిన 509 మంది రోగులకు తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వి. సావిత్రి లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నీరజ వైద్య పరీక్షలు నిర్వహించారు. భారీ సంఖ్యలో రోగులు తరలి రావడంతో మధ్యాహ్నం మూడు గంటల వరకు వైద్యులు వైద్య పరీక్షలు కొనసాగించారు. అయితే ప్రత్యేక వైద్య నిపుణులు హాజరు కాకపోవడం పై రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపీడీవో పి. ఆశాజ్యోతి సందర్శించి రోగులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లోత పండగ, ఎంపీటీసీ సభ్యులు సెగ్గే సత్తిబాబు, పంచాయతీ కార్యదర్శి రాజేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments