ఆగస్టు 30 అల్లూరి జిల్లా (చీఫ్ ఎడిటర్)
గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కంఠారం గ్రామపంచాయతీ పరిధిలో చోద్యం బ్రిడ్జి నుండి కంఠారం పీహెచ్ సీ వరకు 7.5 కిలోమీటర్ల పాటు రోడ్డు నిర్మాణ పనులకు పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. రెండు కోట్లతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని స్థానిక సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ ద్వారా గ్రామస్తులు తమకు తెలియజేసిన వెంటనే ప్రతిపాదనలు పంపించే ఈరోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా నాబార్డ్ నిధులతో దీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కొన్ని గ్రామాలకి రహదారి సౌకర్యం లేకపోవడం.... ఒకవేళ ఉన్నా పూర్తిగా దెబ్బ తిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు, నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. చాలాచోట్ల బ్రిడ్జిల నిర్మాణం అవసరం ఉందని వాటికి రూ.2 నుంచి రూ.3 కోట్లు వెచ్చించి నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోని గింజర్తి లో బ్రిడ్జి ఒకటి నిర్మాణం జరుగుతుందని కొత్త చీడిపాలెంలో కూడా కొన్ని బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని తెలిపారు. పాడి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ప్రతిపాదన పంపించామని ఇలా ప్రతిబిడ్జి నిర్మించి ప్రజలకు రహదారి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఇంత భారీ ఎత్తున గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి* కి గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కన్నయ్యమ్మ, రమణ, వైస్ సర్పంచ్ వనుం బాబు, బీసీ డైరెక్టర్ జి నాగమణి, జి సత్తిబాబు , ఎంపీపీ రమేష్, జెడ్పిటిసి నూకరాజు, వైస్ ఎంపీపీ ఎ. వెంకటరమణ, మండల ప్రెసిడెంట్ జె. బాబులు, ఏఎంసీ చైర్మన్ జే రాజులమ్మ, ట్రై కార్ డైరెక్టర్ ఎస్ లోవరాజు, సర్పంచ్ ముసిలి నాయుడు, ఎంపీటీసీ బి.అప్పారావు, సర్పంచులు శ్రీను, రాజకుమారి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, జి.గోవింద్, ఎంపీటీసీ మల్లేశ్వరి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్ గంగాధర్ , ఎన్ సూరిబాబు, మండల కన్వీనర్ బి.సుధాకర్, బి.శేఖర్, ధోని బాబ్జి, రమణబాబు తదితరులు పాల్గొన్నారు.
.
.
0 Comments