డ్రాపౌట్స్ ని పాఠశాల లో చేర్పించాలి


  1. అనంతగిరి , ఆగస్టు 30 ( చీఫ్ ఎడిటర్) ఆశ్రమ పాఠశాలలో ఉండి డ్రాపౌట్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాలని ఎంపీపీ శెట్టి నీలవేణి సూచించారు .ఆమె మండలంలోని శివలింగపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 50 మందికి పైగా విద్యార్థులు డ్రాపౌట్స్ ఉన్నట్లు గుర్తించారు. వివిధ కారణాలతో విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉన్నారని వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు శెట్టి రాంబాబు ఆమెకు వివరించారు. స్థానికుల సహకారంతో విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పించేలా కృషి చేయాలని ఆమె సూచించారు.పాఠశాలలో బోరు మరమ్మతులకు సహకరించిన ఎంపీపీకి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అదనంగా మరో బోరు ఏర్పాటు చేయాలని విన్నవించారు పాఠశాలలోకి అసాంఘిక శక్తులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధలు కనబరచాలని అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎంపీపీ నీలవేణి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సూచనలను తప్పకుండా పాటిస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం తుమ్మనవలస గ్రామంలో ఎంపీ నిధులతో మంజూరైన బస్సు షెల్టర్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని స్థానిక సర్పంచ్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు కో ఆప్షన్ సభ్యుడు షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments