అరుకు ఆగస్టు 31( పడాల శ్రీనివాసరావు-ఎడిటర్) :అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండల కితలంగి గ్రామ సచివాలయ కోడ్:(10390674) పరిధిలోని పాడి, దేవాలయం, పింపాలగూడ, దూదుగూడ, రంగిసింగూడ, గ్రామాలలో సుమారు 387 గడపలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కా ర్యక్రమంలో ముఖ్య అతిధిగా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా..? అన్న బాగున్నావా..? అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా..? అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రజా ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తూ గిరిజన గ్రామాలను సంస్కరించే బాధ్యత అధికారులదేనంటూ స్పష్టం చేస్తూ వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అందరి ఓటు మీకే నని ఆశీర్వదించారు
వైసిపి పార్టీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక లబ్ధిని వినియోగించుకుని, సమాజంలో గౌరవముగా బతకాలని, అవినీతి,లంచగొండి తనంకు ఆస్కారం లేని తమ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని కోరారు. అదేవిధముగా పథకాలు అందుకున్న వారంతా వీటి అమలు వెనుక ఉన్న మంచి ఆలోచనను, సామాజిక దృక్పథం మరియు ప్రయోజనాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే. చెట్టి ఫాల్గుణ కోరారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ మండల ఎంపిపి, జడ్పిటిసిలు బాకా ఈశ్వరి చటారి జానకమ్మ డుంబ్రిగుడ మండల వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద రావు కితలంగి పంచాయతీ సర్పంచ్ & ఎంపీటీసీ ఒరబోయిన సుబ్బారావు శోభా దేవి, స్థానిక గ్రామపంచాయతీ ఉపసర్పంచ్. కిల్లో ప్రతిమ
డుంబ్రిగుడ మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు.శెట్టి గోపాల్, మండల సచివాలయ కన్వీనర్.అగతంబిడి గణపతి, మండల వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు. బాకా సింహాచలం
చటారి కృష్ణారావు గుజ్జెల చిరంజీవి చిక్కుడు మల్లేష్ పాడి భారికి అశోక్ కుమార్
సొనబారికి బాలరాజు వంతల మోహన్ పోతంగి గ్రామ పంచాయతీ సర్పంచ్. వంతాల వెంకట రావు
మాడగడ పంచాయతీ సూపర్ సర్పంచ్. మండ్యాకెడ్డి బాలరాజు , కించుమండ పంచాయతీ సూపర్ సర్పంచ్హ, రిబారికి అప్పలరాజు, కించుమండ & కొర్ర సంయుక్త ఎంపిటిసి. గుజ్జేల విజయ
స్థానిక పంచాయతీ గ్రామ వార్డు సభ్యులు. జి సింహాద్రి, విభి అర్జున్, కే డోంబు కే అర్జున్, జీ రాంబాబు, వీ సుందర్, బీ భగత్ రామ్, కే రఘపతి మరియు మండల శాఖ అధికారులు వైసిపి కన్వీనర్లు గృహసారథలు గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments