సీలేరు లో ట్రైనింగ్ కలెక్టర్ల బృందం పర్యటన

 గూడెంకొత్తవీధి, ఆగస్టు 30 (రామకృష్ణ-రిపోర్టర్) :  గిరిజన గ్రామాల్లో  సమస్యలపై  అధ్యయనం చేపడుతున్న ట్రైనింగ్ కలెక్టర్ల బృందం అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలం  దుప్పులవాడ పంచాయతీ కేంద్రంలో  బుధవారం  వివిధ అంశాలపై గిరిజనులతో చర్చించారు. ఈ సందర్భంగా బహిరంగ సమావేశం 
ఏర్పాటు చేసి అందులో వైద్యం, విద్య, వ్యవసాయం, అభివృద్ధి అంశాలపై గిరిజనులతో మాట్లాడి వారికున్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన బృందం మాచ్ ఖండ్ నుంచి మోతుగూడెం వరకు ఉన్న విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి తయారీ విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కాంప్లెక్స్ నమూనాని పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రం దేశానికే ఆదర్శంగా నమూనా ఉందని ఐఏఎస్ ల బృందం అన్నారు.

Post a Comment

0 Comments