ఎమ్మెల్యే ను ఆభినందించిన జీకేవీధి వైసిపి నాయకులు


గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 1 రిపోర్టర్ రామకృష్ణ

అల్లూరి సీతారామరాజు జిల్లా వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మిని గురువారం చింతపల్లిలో గూడెం కొత్త వీధి వైసిపి నాయకులు కలసి అభినందించారు. జీకే వీధి వైసీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీపీ బోయిన కుమారి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుందేరి రామకృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ జిల్లా వైసీపీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వసుపరి ప్రసాద్, నేతృత్వంలో ఎమ్మెల్యే చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని తెలిపారు. జీకే విధి వైసీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్ తనకు మరల వైసీపీ మండల అధ్యక్షునిగా నియమించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా వసపరి ప్రసాద్ తనకు జిల్లా కార్యవర్గంలో తీసుకున్నందుకు పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుందేరి రామకృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ వసుపరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి, వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనంద్, సర్పంచ్ పి కృష్ణవంశీ, ఏఎంసీ డైరెక్టర్ వీరోజి త్రిమూర్తులు, వైసిపి సీనియర్ నాయకులు జోరంగి ప్రసాద్, మాజీ సర్పంచ్ జే బాలరాజు, జీకే విధి వైసీపీ యూత్ అధ్యక్షులు అరుణ్ కుమార్, వార్డు సభ్యులు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments