ప్రతి బుధవారం ఉచిత ఓ పి



నర్సీపట్నం. (చీఫ్ ఎడిటర్) అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్రంగా ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రిలో ప్రతీ బుధవారం దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఉచితంగా ఓ పి నిర్వ హించడం జరుగు తుందని డాక్టర్ లాలం వంశీకృష్ణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలు పలు వ్యాధుల బారినపడి వాటిని నయం చేసుకునే క్రమంలో దీర్ఘకాలిక రోగులు గా మారుచున్నారన్నారు. అలాగే వ్యాధి ప్రభలిన వెంటనే వైద్యుల ను సంప్రదించక పోవడం వలన వ్యాధులు ముదిరి వారు దీర్ఘకాలిక రోగులుగా మారుచున్నారన్నారు. అటువంటి వారికోసం ప్రతి బుధవారం తమ లైఫ్ లైన్ ఆసుపత్రిలో ఉచితంగా ఓ పి నిర్వహించడం జరుగు తుందన్నారు. ప్రజలందరు ఆరోగ్యంగా ఉండాలన్నది లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామన్నారు. తమ ఆసుపత్రిలో బి పి ,షుగర్, గుండె, థైరాయిడ్ ఆయాసం పక్షవాతం ఫిట్స్ కీళ్లు కిడ్నీ కాలేయ సమస్యలు మలేరియా డెంగ్యూ అంటే వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు దీనికోసం ప్రతీ బుధవారం ఉచిత ఓ పి నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తమవంతు సాయం అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతీ వక్కరు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ లాలం వంశీకృష్ణ తెలిపారు.

Post a Comment

0 Comments