గూడెంకొత్తవీధి, ఆగస్టు 31 (రామకృష్ణ -రిపోర్టర్):
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఈఓపీఆర్డి పాపారావుతో కలిసి అన్ని సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సంక్షేమం పథకాలు, జగనన్న సురక్ష సర్టిఫికెట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలస్యంగా నమోదు చేయించుకున్న జనన ధృవపత్రాలు మరణ ధృవపత్రాలు సెప్టెంబర్ పదో తేదీ కల్లా సర్వే చేసి ధృవపత్రాలు ఇవ్వాలని, సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 10 వరకు ఆధార్ లేనివారి వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. అలాగే జగనన్న సురక్ష సర్టిఫికెట్లు లబ్ధిదారులకు ప్రింట్లు తీసి ఇవ్వాలని తెలిపారు.
0 Comments