చింతపల్లి ఆగస్టు 30 : (చీఫ్ ఎడిటర్) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ పిలుపు నిచ్చారు బుధవారం ఆ పార్టీ గెలుపు మేరకు చింతపల్లి వారపు సంతలో ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 రద్దుచేసి మూడు సంవత్సరాలు పూర్తి అయిన పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకోలేదని మండిపడ్డారు అంతేకాకుండా సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా లేఖ రాయాలని నిరసనలు చేపడుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు అదిగాక ఏకలవ్య వైద్యశాఖ మరియు విద్యాశాఖలలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సుమారు 3000 పోస్టులను గిరిజనేతరులతో భర్తీ చేశారని దానివల్ల స్థానిక ఆదివాసీ నిరుద్యోగులు పోస్టులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు 650 టీచర్ పోస్టులు 100 ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పోస్టులు రద్దు చేశారన్నారు ఇది గాక బీఈడీ బీఎడ్ హిందీ తెలుగు పండిట్స్ బి పి డి మరియు డిగ్రీ పీజీ పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన ఆదివాసి నిరుద్యోగులు వేలాదిమంది ఉన్నారన్నారు అందుకోసం జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని గత తొమ్మిది సంవత్సరాల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉండగా కోటి యాభై లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి గొప్పలు చెప్పుకుంటుందని ఎంతో చేశారు అంతేకాకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని పివిటిజి గిరిజనులకు గిరిజనులకు అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని వైసిపి ప్రభుత్వం దీనిని విస్మరించిందని అన్నారు అంతేకాకుండా ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లను అన్ని గ్రామాల్లో నియమించాలని అటవీ హక్కుల పత్రాలు సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన అటవీ సంరక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయరాదని డిమాండ్ చేశారు అధిక ధరలు అరికట్టాలని నూతన విద్యుత్ విధానం అమలు చేసి వసూలు చేస్తున్న విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని విభజన హామీలు అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కార్మిక హక్కులు పరిరక్షించాలని తదితర అంశాలతో ఈనెల 30 నుండి వచ్చే నెల మూడో తారీకు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలంతా భాగస్వాములై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి మజ్జి రాంబాబు నిరుద్యోగ యువత పాల్గొన్నారు
0 Comments