చింతపల్లి, ఆగష్టు 31 ( పడాల శ్రీనివాసరావు -ఎడిటర్) :రాఖీ పండుగను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోని గిరి గ్రామాల్లో ఘనంగా రాఖీ పండుగను నిర్వహించారు. ఈ మేరకు చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని నాగులగొంది గ్రామంలో గిరిజనులు వకరికొకరు స్నేహ భావంతోను, సోదర ప్రేమతోను , రాఖీలు కట్టుకుని పండుగ వాతావరణం తలపించే విధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత వారియర్స్ సంస్థ ప్రతినిధులు దూనబోయిన రమణ ఈరెల్లి రాజేష్, ఇండుగ శేఖర్, ఇమ్మంది మోద గిరి,కీముడు బిలాస్కార్,షేక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు
0 Comments