అరుకు ఆగస్టు 3 పడాల శ్రీనివాసరావు (ఎడిటర్) :అరకులోయలోని పర్యాటకశాఖ పున్నమి అతిథి గృహం గోష్టిలో అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ముఖ్యఅతిథిగా పాల్గొని మానవ హక్కులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉందని మానవ హక్కులు అడుగడుగున ఉల్లంఘనకు గురవుతుందని ఇటువంటి తరుణంలో హక్కుల కోసం సంపూర్ణ అవగాహన కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉందని హక్కులు కోరేవారు బాధ్యతలు కూడా నిర్వర్తించవలసి ఉంటుందని గిరిజన ప్రాంతంలో మానవ హక్కుల పై మరిన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యవంతులు చేయాలని ఆయన కోరారు. మణిపూర్ రాష్ట్రం లో మానవ హక్కులు అడుగడుగున ఉల్లంఘించబడ్డాయని, చర్చిలు ధ్వంసం చేయడమే కాకుండా, అనేకమందిని పొట్టన పెట్టుకున్నారని ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు హక్కులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వతంత్రంతో జీవిస్తేనే మానవ హక్కులు పూర్తిగా అమలైనట్టు అని అలాగే సమాజ సేవలో కూడా పాలుపంచుకోవాలని సమాజానికి కొంత మేలు చేయాలన్న సంకల్పంతోనే అరకులోయలో తన క్వార్టర్స్ లో గర్భిణీ స్త్రీల హాస్టల్స్ గా నెలకోల్పానని అదేవిధంగా కరోనాకాలంలో మృతదేహాలను తరలించడానికి ఆఖరి ప్రయాణ రథం ఏర్పాటు చేసి అనేకమందికి తమ సేవలు చేయడం జరుగుతుందని మరెన్నో సేవలు చేయడానికి అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని.ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్. ప్రసన్న కుమార్ , హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్., డా, ఎంవిఆర్ డానియల్ మోడీ , రాష్ట్ర ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ , హ్యూమన్ రైట్స్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి,శెట్టి దిలీప్ కుమార్ , అరకులోయ మండల జడ్పిటిసి. శెట్టి రోషిణి , స్థానిక ఎంపిటిసి సభ్యుడు.ఆనంద్ కుమార్ , ఏపీఆర్ జె సి ప్రిన్సిపల్ లక్ష్మీ నాయుడు, రాష్ట్ర వైస్ చైర్మన్ రవిచంద్ర, హ్యూమన్ రైట్స్ మహిళా నాయకురాలు కృష్ణకుమారి, హెచ్ ఆర్ పి సి ఐ విజయనగరం జిల్లా చైర్మన్ అదృష్ట కుమార్ సౌత్ ఇండియా చైర్మన్ శ్రీకృష్ణ,అరకులోయ డిప్యూటీ తాసిల్దార్ దొన్ను, హెచ్ఆర్పి సీఐ ప్రతినిధులు మొర్దోను రమేష్, వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి వచ్చిన హెచ్ఆర్పిసిఐ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments