శ్రమదానంతో జెర్రిగింది, మర్రిపాకలు రోడ్డు నిర్మాణం

 గూడెంకొత్తవీధి,ఆగస్టు 31(రామకృష్ణ-రిపోర్టర్):ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం కొరకు మర్రిపాకలు జర్రిగొంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు  నిర్మాణానికి పూనుకున్నారు. సుమారు 6 కిలో మీటర్ల రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా  టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి ముక్కల మహేష్ మాట్లాడుతూ. మర్రిపాకలు, జర్రీ గొంది గ్రామానికి ఇప్పటివరకు అంబులెన్స్ వెళ్లిన దాఖలాలు లేవని  అన్నారు. గతంలో జర్రి గొంది గ్రామానికి మూడు వీధులలో 75 ఇళ్లు ఉండేవని, ప్రస్తుతం 25 గృహాలే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్రిగోంది మర్రిపాకలుగ్రామాలలో అధిక శాతం వితంతువులే కనిపిస్తున్నారని వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేయాలని అన్నారు. జర్రిగోంది, మర్రిపాకలు గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని గతంలో వివిధ పత్రికలు అనేకమార్లు వార్తలు ప్రచూరించయని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్వచ్ఛందంగా రోడ్డు నిర్మిస్తున్న గ్రామస్తులకు చేసిన పనికి గాను ప్రభుత్వం వేతనం చెల్లించాలని ముక్కల మహేష్ అన్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపించాలని కోరుకుంటున్నారు.

Post a Comment

0 Comments