వ్యాధులపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి



 అనంతగిరి ఆగస్టు 30  (చీఫ్ ఎడిటర్)  వర్షాకాలం  నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో అంటు రోగాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అలాగే వ్యాధిగ్రస్తులకు తక్షణ వైద్య సేవలు అందించాలని భీమవరం వైద్య సిబ్బందిని అనంతగిరి ఎంపీపీ శెట్టి   నీలవేణి సూచించారు.
 ఆమె గుమ్మకోట పంచాయతీ భీమవరం పిహెచ్ సి ని  ఆమె  ఆకస్మికంగా  సందర్శించారు ఈసందర్భంగా ఆమె  ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భీమవరం పిహెచ్ సి పరిధిలో మలేరియా కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు తక్షణ వైద్య సేవలను అందించాలని సూచించారు. గ్రామాల్లో ఫాగింగ్ ద్వారా దోమలను నియంత్రించేందుకు పంచాయతీ సహకారంతో ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు .పిహెచ్ సిలో ఆశా కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని ఆశా కార్యకర్తలు, సిహెచ్ డబ్ల్యు ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిహెచ్ సి పరిధిలో 15 మంది సిహెచ్ డబ్ల్యూ లు ఉన్నారని వారి అర్హతలను బట్టి ఆశా కార్యకర్తలుగా గుర్తించాలని వారు ఎంపీపీని కోరారు. ఈ మేరకు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. పిహెచ్ సి పనితీరును డాక్టర్ శ్రీనివాస్ అనూప్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దాలన్న దొర నందయ్య తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments