జగనన్న పాలనకు నీరాజనాలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

కొయ్యురు సెప్టెంబర్ 1 పడాల శ్రీనివాసరావు
గిరిజనుల హృదయాల్లో జగనన్న నిలిచిపోయారని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.
తాను సందర్శించిన ప్రతి గడపలోనూ ఆయన పాలనకు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 200వ రోజు కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ గరిమండే, గొర్రెల మెట్ట, అన్నవరం, పిట్టలపాడు, వంతమర్రి, పోకల పాలెం, కునుకూరు, లోయులపాలెం, బారేవులు, జీలిరేవులు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్సిపి శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ప్రతి గ్రామంలోని భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 295 గడపలను వైయస్సార్సీపి ప్రతినిధులు, శ్రేణులతో కలిపి సందర్శించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో ప్రతి సచివాలయ పరిధిలోనూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. తాను సందర్శించిన ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపలనూ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మంచి ఆదరణ లభించిందన్నారు. గిరిజనుల గుండెల్లో ఆయనను ఒక దేవుడిలా కొలుస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల రూపంలో ఇదివరకు ఎన్నడూ...ఏ ప్రభుత్వము అందించని ఆర్థిక సాయాన్ని జగన్మోహన్ రెడ్డి అందిస్తూ ఉండడం తమకు ఎంతో సంతోషంగా ఉందనే విషయాన్ని ఈ కార్యక్రమంలో వ్యక్తం చేశారని తెలిపారు. చాలాచోట్ల సమస్యలను తెలియజేశారని కొన్ని వెంటనే పరిష్కరించడం జరిగిందని మరికొన్ని అధికారులతో చర్చించి ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత పరిష్కరించడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి పరిధి ఎక్కువ అన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు రూ.20 లక్షల మాత్రమే ఇస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సచివాలయాలకు ప్రత్యేకంగా రూ.40 లక్షలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపగలగామన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గిరిజన ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాడేరు నియోజకవర్గంలో 200 రోజులు పాటు ప్రజలు తనను ఆదరించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏ గడపకు వెళ్ళినా తమ కుటుంబ సభ్యులు వచ్చినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పినటువంటి పరిస్థితుల మాత్రమే చూస్తామని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను గుర్తించిన ప్రతి సమస్యకూ పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించడం.. ఇక్కడ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లే వాటిని పరిష్కరించే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా తాను ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం దక్కిందని ఈ సందర్భంగా గిరిజన తరుపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జల్లి బాబులు, సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, ఎంపిటిసి వంతల కుమారి, సచివాలయం కన్వీనర్ తిరుపతిరావు, సాగిన సంజీవ్, సమరెడ్డి కృపానందం , వంతల నారాయణ , ఎంపీపీ లు బడుగు రమేష్ బాబు, కొరాబు అనూష దేవి, కుమారి, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, వైస్ ఎంపీపీలు వెంకటరమణ, నూకాలమ్మ, ముసలి నాయుడు, పుష్పలత , రామకృష్ణ , డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



Post a Comment

0 Comments