ఆగస్టు 30 అనంతగిరి (చీఫ్ ఎడిటర్ ) రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్సార్ పార్టీ రాష్ట్ర ఎస్ టి సెల్ ప్రధాన కార్యదర్శి, హుకుంపేట జెడ్పిటిసి రేగం మత్య లింగం పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ కొనా పంచాయతీ లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపిటిసి, సర్పంచ్ లు కార్యకర్తలు తో సమావేసమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు 2024 ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు అలాగే ప్రతి కార్యకర్త 2019 ఎలక్షన్ కన్నా ప్రతిష్టాత్మకంగా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండల ప్రధాన కార్యదర్శి దోనేరు డానియల్ మండల కన్వీనర్ సురబోయిన నవీన్ మాజీ వైస్ సర్పంచ్ కురిశీల బాబురావు కుర్ర సుబ్బారావు మోటార్ యూనియన్ అధ్యక్షులు కిల్లో ప్రసాద్ గెమ్మెల రమేష్ దోనేరు రాజు దొనేరు మధు అశోక్ తదితరులు పాల్గొన్నారు
0 Comments