గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


గూడెంకొత్తవీధి. ఆగస్టు 31 (పడాల శ్రీనివాసరావు -ఎడిటర్):అల్లూరి జిల్లా జి కె వీధి మండలంలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న ఇరువురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేయడం జరి గిందని సి ఐ జి అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో బాగంగా గంజాయిని శాశ్వతంగా అరికట్టేందుకు అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా, అధేశాల మేరకు చింతపల్లి సబ్ డివిజనల్ అధికారి కె ప్రతాప్ శివ కిషోర్, ఆధ్వర్యంలో -జి.కే.వీధి సర్కిల్ ఇన స్పెక్టర్ జి అశోక్ కుమార్ ఎస్ ఐ కె .అప్పలసూరి లు గంజాయి నిర్మూలన దిశగా పటిష్టంగా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 30 వతేదీన జి.కె.వీధి మండలం వంచుల పంచాయతీ వై కట్టువీధి గ్రామం వద్ద గంజాయి సాగు చేస్తూ పట్టుబడిన నిందుతులపై జి.కే.వీధి పోలీస్ స్టేషన్ లో ఎన్ డి పి ఎస్ యాక్టు క్రింద నమోదు చేయబడిన గంజాయి కేసులోని నిందుతులు వై కట్టు వీధి గ్రామానికి చెందిన పాంగి లక్ష్మయ్య కు పండించుకోవడానికి భూమి లేనందున కుటుంబ పోషణ కష్టం అయ్యి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి పంటను సాగుచేద్దామని నిశ్చయించుకుని తన వరుసకు చిన్నాన్న అయిన పాంగి సుబ్బారావు ను గంజాయి పంట వేయడానికి 03 సెంట్లు భూమిని అడిగి వచ్చిన లాభంలో కొంత డబ్బు ఇస్తానని చెప్పడంతో దానికి అంగీకరించి ఆ మూడు సెంట్లు భూమిని ఇవ్వగా పాంగి లక్ష్మయ్య ఆ భూమిలో 40 గంజాయి మొక్కలను వేసి వాటిని సాగు చేస్తున్నాడు. పాంగి సుబ్బారావు సాగు చేయుటకు అప్పుడప్పుడు సహాయం చేసేవాడు. ఈ విదంగా తేదీ 30వ తేదీన కూడా ఇద్దరు ముద్దాయిలు గంజాయి తోటలో గంజాయి మొక్కలకు నీళ్లు వేస్తుండగా పోలీసు లను చూసి పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు ముద్దాయిలను దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చింతపల్లి కోర్టు కు తరలించారు.
అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా, , చింతపల్లి సబ్ డివిజనల్ అధికారి కె ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు ఆపరేషన్ పరివర్తన లో భాగంగా గoజాయి సాగు నిర్మూలన లో భాగంగా గంజాయి పంటలను ద్వంసం చేసి వాటికి ప్రత్నమాయంగా రైతులందరికి పండ్ల మొక్కలు మరియు రాజ్మా విత్తనాలు పంపిణి చేస్తున్నాము. వాటిని రైతులందరు ఉపయోగించుకొని గంజాయి సాగు కు దూరంగా ఉండమని కోరుతున్నాము. ఇక మీదట ఎవరయినా గంజాయి సాగును చేసినటట్లు ఇతే వారి పైన ఎన్ డి పి ఎస్ చట్టం క్రింద కేసు నమోదు చేసి జైలుకి పంపించడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిం చారు. దానితో పాటు వారి మీధ ఉన్న ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుందన్నారు మరియు వారి యొక్క భూమి పట్టాలను రద్దు చేసి, భూములను కూడా జప్తు చేయబడుతుందన్నారు
చింతపల్లి సబ్ డివిజనల్ అధికారి కె ప్రతాప్ శివ కిషోర్, స్వయంగా వై కట్టువీధి గ్రామం కి వచ్చి గంజాయి సాగుని పరిశీలించి గ్రామస్తులకు అవగాహన కల్పిం చారు గ్రామంలో ఉన్న మహిళలు స్వయంగా ముందుకు వచ్చి గంజాయి పంటను ద్వంసం చేసి, కాల్చి బూడిద చేసారు. ఈ కేసులో గంజాయి సాగు చేస్తున్న పాంగి లక్ష్మయ్య మరియు అతనికి భూమి ఇచ్చిన భూ యజమాని పాంగి సుబ్బారావు లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని ఈ కేసులో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష సి ఐ తెలిపారు.

Post a Comment

0 Comments