నేడు మావోయిస్టుల కంచుకోటలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పర్యటన.. కొయ్యూరు- జీకే వీధి సరిహద్దు గ్రామాల్లో అడుగు పెడుతున్న తొలి ఎమ్మెల్యే

చింతపల్లి, ఆగస్టు 31( విఎస్ జె ఆనంద్ - సీనియర్ జర్నలిస్ట్) : మావోయిస్టు పార్టీకి కంచు కోటగా పేరొందిన కొయ్యూరు-జికే వీధి సరిహద్దు ప్రాంతాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గురువారం పర్యటించనున్నారు. ఈ ప్రాంతాలను సందర్శించిన తొలి ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరు నియోజకవర్గం లో శివారు గ్రామాలను సైతం కాలినడకన వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుని, ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా పేరుందిన జి మాడుగుల సరిహద్దు ప్రాంతాలు, చింతపల్లి మండలం బలపం కోరుకొండ ప్రాంతాలను ఇప్పటికే ఆమె పర్యటించారు. తాజాగా అధికారులు సైతం వెళ్లడానికి సాహసించే అత్యంత శివారు ప్రాంతాలైన కొయ్యూరు మండలం గొర్లమెట్ట, గరికబంద,గరిమండ, పిట్టలపాడు, వంతమర్రి, కన్నవారం, చీడిపల్లి, కునుకూరు, లోయలపాలేం, బాలరేవులు, పిడుగురాయి, జువురేవులు గ్రామాలను పర్యటిస్తున్నారు. భద్రత నేపథ్యంలో పోలీసులు అనుమతించకపోయినా, తనకు ఓటేసి గెలిపించిన ఆదివాసీలను స్వయంగా కలవాలనే సంకల్పంతో ఆమె వెనకడుగు వేయడం లేదు. శివారు గ్రామాలను సైతం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సందర్శించి ఆదివాసులకు దగ్గరవుతున్నారు. భాగ్యలక్ష్మి దూకుడు కి ప్రతిపక్ష నాయకుడు సైతం డీలా పడిపోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న ఏనాడు ఎమ్మెల్యే వెళ్లలేని ప్రాంతాలకు భాగ్యలక్ష్మి సందర్శిస్తూ తనకంటూ ఒక మార్క్ ని వేసుకుంటున్నారు. 

Post a Comment

0 Comments