మండలంలోని శివారు డేగలపాలెం గ్రామం ఆదిమజాతి ఆదివాసి(పీవీటీజీ)లకు చేయూత వారియర్స్ ట్రస్ట్ యువకులు అన్నదానం ఏర్పాటు చేశారు. మంగళవారం గ్రామంలో యువకులు భోజనాలు స్వయంగా సిద్ధం చేసి గ్రామంలో నున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులకు భోజనాలు పెట్టారు. ఈ సదర్భంగా చేయూత వారియర్స్ అధ్యకులు దూనబోయిన రమణ మాటాడుతూ 2007 పదోతరగతి బ్యాచ్ కి చెందిన పది మంది యువకులు కలిసి చేయూత వారియర్స్ ట్రస్ట్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గత మూడేళ్లగా రక్తదాన శిబిరాలు, గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్యశి బిరాలు ఏర్పాటు చేశామన్నారు. యాచకులకు దుప్పట్లు, రగ్గులు పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేశామన్నారు. తాజాగా శివారు గిరిజన గ్రామాల ఆదివాసీలకు ఒకరోజు మెరుగైన పోషకాహారం, నెలలో రెండు సార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని డేగలపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించామన్నారు. చేయూత వారియర్స్ వ్యక్తిగత నిధులతోపాటూ చింతపల్లికి చెందిన కొంత మంది దాతల సహకారంతో ఈకార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అన్నదానం చేయడంతోపాటూ స్థానిక ఆదివాసీల సమస్యలను స్వయంగా తెలుసుకుని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకొనివెళతామన్నారు. డేగల పాలెం గ్రామంలో ఆదివాసీలు ఒక్కరికి పక్కా గృహలులేవని, రక్షిత మంచినీరు, తాగునీరు సమస్య అధికంగా ఉందన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళతామన్నారు. ఈకార్యక్రమంలో చేయూత వారియర్ సభ్యులు రాజేశ్, మోదగిరి, శేఖర్, గుత్తల లోవరాజు, కిముడు బిలాస్కర్ పాల్గొన్నారు.
0 Comments