అపరిచిత వ్యక్తులు వసతి గృహంలో ప్రవేశించలేదు: వంగసార ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ప్రసాద్ రావు

చింతపల్లి జూన్ 26:
వంగసార బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలోకి అపరిచిత వ్యక్తులు ఎవరు ప్రవేశించలేదని ప్రధానోపాధ్యాయులు పలాసి ప్రసాద్ రావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 25వ తేదీన ఓ దినపత్రికలో పాఠశాల ఆవరణలోకి రాత్రివేళ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తెలిపారు. దీనిపై పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాచ్ మెన్ లను వేర్వేరుగా విచారించడం జరిగిందన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరు పాఠశాల ఆవరణలోకి రాలేదని ఈ విచారణలో వెల్లడి అయింది అన్నారు. వాచ్ మెన్ రాత్రివేళ వసతి గృహంలోనే ఉంటున్నారని, అపరిచిత వ్యక్తులు ప్రవేశించినట్లయితే తమకు తెలుస్తుందని వాచ్ మెన్ తెలియజేశారన్నారు. పాఠశాల ప్రతిష్టను దిగజార్చే విధంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త కథనాన్ని ఖండిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. 

Post a Comment

0 Comments