*90 అడుగులకు అభ్యంతరం లేదంటున్న మెజార్టీ భవన యాజమానులు
*యాజమానులను అభిప్రాయాన్ని గౌరవిస్తామన్న ఎమ్మెల్యేనర్సీపట్నం( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) మంగళవారం 25:నర్సీపట్నం రోడ్డు విస్తరణ 100 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు భవన యాజమానులు 80 అడుగులకు కుదించాలని కోరుతున్నారు. 17 మంది భవన యాజమానులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. గత ప్రభుత్వ హయాంలో 120 అడుగుల మేరకు విస్తరించాలని మార్కింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో వంద అడుగులకు విస్తరించాలని నిర్ణయించి స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది డిసెంబరులో నర్సీపట్నం వచ్చి కంకుస్థాపన కూడా చేశారు. అయితే 50 శాతం మంది వ్యాపారులు మధ్యప్తంగా 90 అడుగులకు విస్తరించడానికి అభ్యంతరం లేదంటున్నారు. 90 అడుగులకు విస్తరిస్తే తాము భవనాల తొలగింపుకు సహకరిస్తామని మంగళవారం నిరభ్యంతరం పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సైతం ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని, అవసరమైతే ప్రజల కోసం పట్టువీడాల్సిందేనని భావించారు.
ఈ మేరకు ఒక మెట్టు దిగి మంగళవారం రోడ్డు విస్తరణ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న భవన యాజమానులు ఇళ్లకు స్వయంగా వెళ్లి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ఇంట్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో మెయిన్ రోడ్డు 120 అడుగులకు విస్తరింపజేయాలని అనుకున్నారని చెప్పారు. 120 అడుగులు అయితే చాలా మంది నష్టపోతారనే ఉద్దేశ్యంతో తాము 100 అడుగులు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని కోసం మున్సిపల్ కౌన్సిల్లో 100 అడుగుల రోడ్డు విస్తరణకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. దీంతో చాలా మంది భవన యాజమానులు తనను స్వయంగా కలిసి 100 అడుగులకు విస్తరణ చేస్తే నష్టపోతామని, 90 అడుగులకు తగ్గిస్తే సహకరిస్తామని విజ్ఞప్తి చేశారని చెప్పారు.
100 అడుగులకు విస్తరణ చేస్తేనే ఉపయోగం ఉంటుందని తాము భావించామన్నారు. అయితే 90 అడుగులకు విస్తరణ చేయాలని సుమారు 50 శాతం పైగా భవన యాజమానులు తెలియజేయడం జరిగిందన్నారు. భవన యాజమానులు అభిప్రాయాలను గౌరవిస్తామని, అవసరమైతే అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాబోయే భవిష్యత్ తరాల కోసం భవన యాజమానులు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్శన్ బోడపాటి సుబ్బలక్ష్మీ, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, వైసిపి పట్టణ అధ్యక్షులు ఏకా శివ, సచివాలయ కన్వీనర్ తమరాన శ్రీను, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు ధనిమిరెడ్డి నాగు, కోఆప్షన్ కౌన్సిలర్లు షేక్ రోజా, లగుడు స్వామి, కర్రి గోవిందు, భవన యాజమానులు పాల్గొన్నారు
0 Comments